Mar 18, 2025, 13:03 IST/
డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ
Mar 18, 2025, 13:03 IST
TG: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. లక్ష్మి(48) అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి వెలుతురు వస్తుండటంతో గమనించిన స్థానికులు వెళ్లి చూడగా.. అప్పటికే లక్ష్మి మృతి చెందింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.