50 ఏళ్లకే పెన్షన్‌పై మంత్రి శ్రీనివాస్ కీలక ప్రకటన

65చూసినవారు
50 ఏళ్లకే పెన్షన్‌పై మంత్రి శ్రీనివాస్ కీలక ప్రకటన
AP: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా కీలక ప్రకటన చేశారు. పెన్షనర్ల తగ్గింపు, 50 ఏళ్లకే పెన్షన్ హామీపై YCP ఎమ్మెల్సీలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. 'బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే రూ. 4వేల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. గత ప్రభుత్వం వెయ్యి పెంచడానికి ఐదేళ్లు సమయం తీసుకుంటే మేం రాగానే రూ.1000 పెంచాం. ప్రస్తుతం అనర్హుల పెన్షన్లు మాత్రమే తొలగిస్తున్నాం' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్