రెండు బైకులు ఢీకొని రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం పెనగలూరు మండలం ఇండ్లూరు గ్రామానికి చెందిన నరసింహులు(35) తన కుమారుడు రిషి (7) తో కలిసి నెల్లూరులో ఉంటున్న తన కుమార్తెను చూడడానికి బైక్ పై వెళుతుండగా రాపూరు మండలం బాలాయి పల్లి వద్ద ఎదురుగా వస్తున్న బైక్ డీ కొనడంతో నరసింహులు మరణించగా, రిషికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రిషి ని రాపూరు ఆసుపత్రికి తరలించారు.