తమిళనాడులో గురువారం ఉదయం మంటల్లో చిక్కుకుని కారు దగ్ధమైంది. తిరువేకాడు సమీపంలో కారులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. కారులో నుంచి మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్.. వెంటనే కారు నుంచి కిందకు దిగిపోయాడు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.