ఎట్టకేలకు ఒక్కటైన ప్రేమ జంట
పెనగలూరు మండలంలోని ఈటిమార్పురం గ్రామానికి చెందిన లావణ్య దేవిని వెంకట సాయి ప్రేమిస్తున్నానని చెప్పి చివరకు పెళ్లికి నిరాకరించడంతో శుక్రవారం పెనగలూరు పోలీసు స్టేషన్ వద్ద యువతీ తరుపున వారు ధర్నా చేశారు. అయితే శనివారం గ్రామ పెద్దల సమక్షంలో ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఎట్టకేలకు ప్రేమికులు ఇద్దరు వివాహం చేసుకోవడంతో ఇరు కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి.