పెండ్లిమర్రి: పంటలు పరిశీలన
పెండ్లిమర్రి మండలంలోని ఏనుగు వారి పల్లి గ్రామంలో రైతులకు రాయితీపై సరఫరా చేసిన శెనగ పంటలను గురువారం సహాయ వ్యవసాయ సంచాలకులు శంకర్ నాయక్, వ్యవసాయ అధికారి జిపి ఓబులేష్ పంటలను పరిశీలించారు. అనంతరం ఇసుకపల్లి గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.