తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నియామక ఫలితాలు విడుదలయ్యాయి. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలకు 24 మందిని TGPSC ఎంపిక చేసింది. IPM పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలు, ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో 24 పోస్టుల భర్తీకి బోర్డు 2022 జులై 21న నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 16 వేల 381 మంది దరఖాస్తు చేయగా, 2022 నవంబరు 7న రాతపరీక్ష నిర్వహించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాల కోసం వెబ్సైట్ tspsc.gov.in ని క్లిక్ చేయండి.