భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.