27న ఉద్యోగ మేళా
కడప జిల్లాలోని పోరుమామిళ్ల, వేముల, కమలాపురంలో ఈ నెల 27న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కమలాపురంలోని పాలిటెక్నిక్ కళాశాల, వేములలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల, పోరుమామిళ్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నిర్వహించే ఉద్యోగ మేళాల్లో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పదో తరగతి, ఆపై విద్యార్హత కలిగిన వారు అర్హులన్నారు.