ఏటూరు నాగారం: మహాలక్ష్మి దేవి రూపములో అమ్మవారు

65చూసినవారు
ఏటూరు నాగారం: మహాలక్ష్మి దేవి రూపములో అమ్మవారు
ఏటూరు నాగారం మండలంలోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయం వద్ద జరుగుతున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మిదేవి రూపంలో దర్శనం ఇచ్చారు. భక్తులు అమ్మవారిని శ్రద్ధా భక్తులతో పూజించి అమ్మవారి ఆశీర్వచనాన్ని పొందారు. అర్చకులు యల్లాప్రగడ సూర్య నారాయణ శర్మ అమ్మవారికి శ్రీ సూక్త విధాన షోడశ ఉపచరాలతో పూజను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్