ప్రొద్దుటూరు: ఇటుక బట్టీల అవసరాలకు ఇసుక అనుమతించాలి

75చూసినవారు
ప్రొద్దుటూరు: ఇటుక బట్టీల అవసరాలకు ఇసుక అనుమతించాలి
ప్రొద్దుటూరు పట్టణంలో ఇటుక బట్టీలపై వందలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, ఉచిత ఇసుక తెచ్చుకునే వీలు లేక ఇటుకల తయారీ పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయని సీపీఐ నేతలు స్థానిక తహశీల్దారు మంగళవారం వినతి పత్రం అందజేశారు. స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుక తీసుకుపోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ప్రొద్దుటూరులో అమలు కావడం లేదని సీపీఐ నేతలు రామయ్య, సుబ్బారాయుడు అధికారుల దృష్టికి తెచ్చారు.

సంబంధిత పోస్ట్