‘నాపై జగన్ హత్యా ప్రయత్నం చేశాడు’ అని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై వైఎస్ విజయమ్మ స్పందించారు. పాత వీడియోను బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘చిన్న చిన్న బేదాభిప్రాయాలు ఉండొచ్చు, అంతమాత్రాన తల్లికి కొడుకు కాకుండా పోతాడా?. ఇటీవలి రెండు లేఖలు నేను రాసినవే. ఇంకోసారి తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తా’ అని ఆమె అన్నారు.