ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో పులివెందుల పట్టణంలోని పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి నెలకొంది. శనివారం ఉదయమే ఇంటర్ విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకుని వేచి ఉన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్ష మొదటి రోజు కావడంతో విద్యార్థులు పరీక్షా సమయం కంటే గంటసేపు ముందుగానే పరీక్షా కేంద్రం వద్దకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్దకు తల్లిదండ్రులు తమ పిల్లలను స్వయంగా వచ్చి వదిలిపెడుతున్నారు.