పులివెందులలోని ముద్దనూరు రింగ్ రోడ్డు వద్ద ముగ్గురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. బుధవారం సాయంత్రం అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ జీవన్ గంగానాధ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ముద్దనూరు రింగ్ రోడ్డు వద్ద ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి వారి వద్ద నుంచి 10తులాల బంగారు, 11 తులాల వెండి ఆభరణాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నామన్నారు. ముగ్గురు ముద్దాయిలను కోర్టుకు హాజరుపరచామన్నారు.