రబీ సీజన్ లో సాగు చేసిన పంటలకు సంబంధించి పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలని వేముల ఏవో చెన్నారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేముల మండలం పెండ్లూరులో రైతులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజన్ లో పంటల బీమాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలను ప్రకటించిందన్నారు. ఈ సీజన్ లో రైతులే ప్రీమియం డబ్బును మీసేవా కేంద్రంలో కానీ, గ్రామ సచివాలయంలో కానీ చెల్లించాలన్నారు.