రాజంపేట పరిధిలోని సానిపాయ నిషేధిత అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన 15 మందిని మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రంపాలు, గొడ్డళ్లు, నాలుగు కార్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. వారిలో నలుగురు అన్నమయ్య జిల్లాకు చెందిన వారు కాగా మిగిలిన 11మంది తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ఆర్ఎస్ఐ సురేశ్ అటవీశాఖ అధికారులతో కలిసి కూంబింగ్ చేపట్టారు. ఆ సమయంలో వీరు పట్టుబడ్డారు.