అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం ముక్కవారిపల్లిలో ఎస్వీ కళ్యాణ్ మండపం దగ్గర జాతీయ రహదారిపై కారును లారీ ఢీ కొన్న సంఘటనలో కారు నుజ్జైంది. కారులో డ్రైవర్‌తో పాటు నలుగురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి సిమ్స్‌కు తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేశారు.