రక్తంతో సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటం
అన్నమయ్య జిల్లా రామాపురం మండల పరిధిలోని డాక్టర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఆర్ట్ మాస్టర్ డి ఆనంద్ రాజు, తన రక్తంతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా గురువారం ఆయన చిత్రపటాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వి. వి వరప్రసాద్ సిబ్బంది కలసి ఆర్ట్ మాస్టర్ ఆనంద్ రాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.