విజయ దశమి సందర్భంగా అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యాలయంలో బుదవారం ఆయుధ పూజ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నిర్వహించినారు.
ఆలగనే జిల్లా ప్రజలందరికీ, పోలీసు అధికారులుకి మరియు సిబ్బందికి విజయ దశమి శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ తెలియజేశారు. దసరా ఉత్సవాలలో భాగంగా సాంప్రదాయ పద్ధతులను పురస్కరించుకుని ఆనవాయితీగా విజయ దశమి రోజున నిర్వహించే ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఈ రోజు జిల్లా సాయుధ పోలీసు విభాగంలో ఉన్న పోలీసు ఆయుధాలకు, స్పెషల్ పార్టీ ఆయుధాగారం, జిల్లా భద్రతా విభాగం మరియు పోలీసు యం. టి. ఓ వాహనాలకు జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, సకల శుభాలతో, సిరి సంపదలతో ఆనందంగా దసరా పండుగను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.