టిడిపి శ్రేణుల రిలే నిరాహారదీక్ష

61చూసినవారు
టిడిపి శ్రేణుల రిలే నిరాహారదీక్ష
ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి, జాతీయ స్థాయిలో ఉన్న తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన గొప్పవాడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అన్ని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ భాష అన్నారు. ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం పేరును తొలగించి వైఎస్సార్ విశ్వ విద్యాలయంగా మార్చిన జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం రాయచోటి కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్ష టిడిపి శ్రేణులు చేపట్టారు. రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలతో పాటు మైనారిటీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన నాయకుడు ఎన్టీఆర్ అన్ని అన్నారు. అంత గొప్ప మహనీయుడు చేసిన సేవకు గుర్తుగా ఎపి వైద్య విశ్వవిద్యాలయంకు ఆయన పేరును పెట్టి నిరంతరం ఆయన గుర్తు ఉండేలా చేశారని ధ్వజం ఎత్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్