May 21, 2024, 10:05 IST/ములుగు
ములుగు
ములుగు జిల్లాలో టిఎస్ స్థానంలో టిజి అమలు చేయాలి: కలెక్టర్
May 21, 2024, 10:05 IST
టిఎస్ స్థానంలో టిజి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. టిఎస్ స్థానంలో టిజిని వినియోగించేందుకు కేంద్రం గెజిట్ జారీ చేసినందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చాయని అన్నారు. కాగా జిల్లాలో ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు టిజిని వాడాలని కలెక్టర్ ఆదేశించారు.