ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు రుణాల రీ షెడ్యూలింగ్, కొత్త రుణాల కల్పనకు ఉదారంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి బ్యాంకుల అధికారులను కోరారు. గురువారం కాకినాడలో కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో జిల్లా అధికారులు, బ్యాంకర్లతో డిస్ట్రిక్ట్ కన్సల్టేటీవ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధ్యక్షతన జరిగింది.