కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామానికి చెందిన బిజెపి యువ నాయకులు మల్ల వీరబాబు ఆదేశాల మేరకు బొద్దవరం గ్రామంలో గల బిజెపి నాయకులు సుర్ల రమణ నాయకత్వంలో గ్రామ పొలిమేరల నుండి శివాలయం వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రకృతి పరంగా మనం పొందే లాభాలు, పర్యావరణం పట్ల ప్రజలకు కలిగే నష్టాలు వివరించారు.