తుని: డ్యాన్స్ చేసిన డ్రైవర్ విధుల నుంచి తొలగింపు
ఆర్టీసీ డ్రైవర్ డాన్సుకు మంత్రి నారా లోకేష్ ఫిదా అయ్యారు, "నీ డాన్స్ సూపర్ బ్రదర్ కీపిట్ అప్" అంటూ అభినందించారు. కానీ, డ్రైవర్ విధుల సమయంలో డాన్స్ చేశాడంటూ ఉన్నతాధికారులు ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. లోవరాజు, 10 సంవత్సరాలుగా కాకినాడ జిల్లా తుని డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. స్కూల్ పిల్లలు అతడిని డాన్స్ చేయమని కోరగా, వీడియో వైరల్ అయింది. ఇప్పుడు అతను తన ఉద్యోగం పోగొట్టుకోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.