
గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
తునిలోని జగన్నాథగిరి గురుకుల విద్యాలయాల్లో చేరెందుకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ హేమలత తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైందని ఏప్రిల్ 25వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహిస్తారన్నారు. పాఠశాలలో ఐదో తరగతిలో చేరేందుకు 80 సీట్లు, 6 , 7 , 8 తరగతిలో మిగిలిన సీట్లకు ఏప్రిల్ 6 వరకు గడువు పొడిగించామన్నారు.