AP: ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఆప్కాస్ సిబ్బందితో పాటు పెన్షనర్ల వివరాలను నమోదు చేయాలని ఆర్జేడీలను విద్యాశాఖ ఆదేశించింది. హౌస్ హోల్డ్ డేటా బేస్‌లో పలువురి వివరాలు నమోదు కాకపోవడంతో విద్యాశాఖ ఈ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తూ డేటా బేస్‌లో పేర్లు లేని ఉద్యోగులు 2.80 లక్షల మంది ఉండగా.. ఒక్క విద్యాశాఖలోనే 63 వేల మందికిపైగా ఉన్నారు.