BGTలో భాగంగా ఫైనల్ టెస్ట్ మ్యాచ్ ఆడటానికి టీమిండియా సిడ్నీకి చేరుకుంది. నాలుగో టెస్టులో ఓటమితో ఇప్పటికే భారత్‌కు WTC ఫైనల్ చేరుకునే ఆశలు సన్నగిల్లగా, ఈ టెస్టులోనూ ఓడితే పూర్తిగా గల్లంతవుతాయి. తొలి టెస్టులో భారత్, 2వ టెస్టులో ఆసీస్ విజయం సాధించాయి. మూడో టెస్ట్ డ్రా కాగా, 4వ మ్యాచ్‌లో ఆసీస్ గెలిచిన విషయం తెలిసిందే. ఐదో టెస్టు జనవరి 3న ఉదయం 5 గంటలకు సిడ్నీలో ప్రారంభం కానుంది.