
సిట్ అదుపులో సజ్జల శ్రీధర్ రెడ్డి
ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఏ6గా ఉన్న ఆయనను సిట్ అధికారులు ప్రశ్నించారు. మద్యం లావాదేవీలు, కమీషన్ల వ్యవహారంపై విచారణ జరిపారు. అనంతరం శ్రీధర్‌ను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.