TG: : ముస్లిం సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్మాత్మికతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిస్తోందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, అల్లా దీవెనలు పొందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.