AP: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పైలట్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చాపర్ విమానాన్ని నడుపుతూ హైదరాబాద్ పరిసరాల్లో చక్కర్లు కొట్టారు. "కల నిజమైంది. అధికారికంగా పైలట్ అయ్యా. ఇది ప్రారంభం మాత్రమే. నాకు మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు. మరిన్ని సాహసాలు ముందున్నాయి" అని తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.