శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య ముస్తాబవుతోంది. రామ మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రామాలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఏప్రిల్ 6న నవమి సందర్భంగా ఆలయంలో బాల రాముడికి ప్రత్యేకంగా అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సూర్య తిలకం దిద్దనున్నారు.