స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై ‘ద్రోహి’ అనే వ్యాఖ్యలు చేసిన కారణంగా తీవ్ర వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ స్పందించారు. కునాల్‌కు పీకే మద్దతు తెలిపారు. "‘ద్రోహి’ అనడంలో తప్పేముంది?..అతని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ వివాదం చెలరేగింది" అని పేర్కొన్నారు.