కోనసీమ జిల్లాలోని గ్రామాలలో జలజీవన్ మిషన్, సీఎస్ఆర్ నిధులతో జరుగుతున్న త్రాగునీటి సరఫరా అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. నిధులు మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు టెండర్ ప్రక్రియ నిర్వహణ, అభివృద్ధి పనుల పురోగతి గురించి ఆయన వివరాలను అడిగి తెలుసుకున్నారు.