అమలాపురం: పేరూరు లంకతోట రోడ్డును పరిశీలించిన అధికారులు

69చూసినవారు
అమలాపురం మండలం పేరూరు లంకతోటకు ముంపు గురవుతున్న రోడ్డును పంచాయతీరాజ్ శాఖ అధికారులు శుక్రవారం పరిశీలించారు. రోడ్డు సమస్యపై స్థానికులు ఆందోళన చేయడంతో అధికారులు స్పందించారు. పీఆర్డీఈ రాజకుమార్, పంచాయతీ అధికారులు కలిసి లంకతోటకు వెళ్లే అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ముంపు నివారణకు చర్యలు చేపడతామని డీఈ రాజ్ కుమార్ గ్రామస్థులకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్