కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 15వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాలా కార్మికులు విన్నవించారు. కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాలా అమలాపురం శ్రీదుర్గా హనుమాన్ సెంటర్ ఆధ్వర్యంలో బండారులంకలో ఆదివారం జరిగిన కార్తీక సమాధానంలో మంత్రి పాల్గొన్నారు.