అమలాపురం: కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

62చూసినవారు
కోడిపందేలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ హెచ్చరించారు. గురువారం అమలాపురం కలెక్టరేట్లో జేసీ నిశాంతి, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కోడిపందేల నిర్వహణ అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రబల తీర్థాలు నిర్వహించే ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్