కోనసీమ దివ్యాంగుల ఐక్య జేఏసీ మరియు అమలాపురం పట్టణ వికలాంగుల సమైక్య ఆధ్వర్యంలో అమలాపురం లోని గడియార స్తంభం దగ్గర దివ్యాంగుల పెన్షన్ 3000 నుండి 6000 కు పెంచిన సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పీఎం మోడీ, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు శనివారం దివ్యాంగులు పాలాభిషేకం చేశారు. అనంతరం మోటూరి వెంకటేశ్వరరావు దివ్యాంగులకు నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ చేశారు.