మద్దిలపాలెం: నేడు స్మశాన వాటికలో కార్పొరేటర్ ధర్నా
జీవీఎంసీ 22వ వార్డు స్మశాన వాటికలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిరసన దీక్ష చేపట్టనున్నట్లు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. మంగళవారం మద్దిలపాలెంలో మాట్లాడుతూ స్మశాన వాటిక అభివృద్ధి పనుల విషయంలో అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రెండేళ్లు కావస్తున్నా అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదు అన్నారు. జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్య వైఖరే దీనికి కారణం అన్నారు.