ఉమ్మడి విశాఖ జిల్లాకు వాతావరణ శాఖ గురువారం కీలక హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినప్పటికీ ఆ ప్రభావం కొనసాగుతూ ఉంటుందని వెల్లడించింది. సముద్ర తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని సాధారణ రోజుల కంటే 1.5మీటర్ల అదనంగా అలలు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. విశాఖ గంగవరం పోర్టుకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.