
విశాఖపట్నం: 5,74,905 జిల్లాలో ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య
విశాఖపట్నం జిల్లాలో ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య దాదాపు ఆరు లక్షలకు చేరింది. ఇందులో ఐటీ అనుబంధ రంగాలతో పాటు ఇంజనీరింగ్, డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులు పూర్తిచేసినవారు, నిరక్షరాస్యులు ఉన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచడం, శిక్షణ అందించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు మొగ్గుచూసే వారిని గుర్తించడానికి గత నెలలో సచివాలయ సిబ్బంది ఇంటింటి సర్వే చేశారు.