పి. గన్నవరం మండలం లంకలగన్నవరంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్రసహాయకుడు యోగాలపై డ్వామా ఎ. పి. డి. , విచారణాధికారి మల్లిఖార్జునరావు శనివారం విచారణ చేపట్టారు. పలు పనుల్లో సుబ్బరాజు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఎంపీపీ నాగలక్ష్మి, సర్పంచి రామకృష్ణ మరికొందరు చేసిన ఆరోపణలపై విచారణ చేశారు. విచారణ ఇంకా పూర్తికాలేదని, సమగ్రంగా విచారణచేసి తదుపరి చర్యలు తీసుకుంటామని మల్లిఖార్జునరావు విలేకరులకు తెలిపారు.