రాజోలు: శంకరగుప్తం డ్రెయిన్ వంతెన నిర్మాణంపై ఎమ్మెల్యే సమీక్ష

78చూసినవారు
రాజోలు: శంకరగుప్తం డ్రెయిన్ వంతెన నిర్మాణంపై ఎమ్మెల్యే సమీక్ష
రాజోలు నియోజకవర్గం పరిధిలోని మామిడికుదురు మండలంలో కరవాక- గోగన్నమఠం గ్రామాలను కలుపుతూ శంకరగుప్తం డ్రైన్పై వంతెన నిర్మాణంపై రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. వంతెన నిర్మాణంపై సంబంధిత అధికారులతో కలిపి క్షేత్రస్థాయిలో పర్యటించారు. రెండు గ్రామాలకు చెందిన ప్రజలతో ఆయన మాట్లాడారు. వంతెన నిర్మాణానికి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఆయన వెంట కూటమి నేతలు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్