కాకినాడ: నాణ్యమైన వైద్యం అందించడమే మా లక్ష్యం
ఆధునిక వైద్య పరికరాలతో వైద్యం అందించి రోగులకు వైద్యంపై నమ్మకం కలిగించేలా భరోసా కల్పించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచించారు. ఆదివారం కాకినాడలోని గాంధీనగర్ మరిచాయే హెల్త్ కేర్ ఆసుపత్రిని ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యాధునిక సౌకర్యాలతో సీనియర్ వైద్యులతో వైద్యం అందించి మన్ననలు పొందాలని అన్నారు.