రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో పని చేస్తున్న కాంట్రాక్టు స్టాప్ నర్సులను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ నర్సస్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు చిన్నారి, గౌరవ అధ్యక్షులు ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. కాకినాడ ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఆవరణలో శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఇటీవల జారీ చేసిన 115 జిఒను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.