పవిత్ర కార్తీక మాసంమొదటి సోమవారం నియోజకవర్గం లోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ఓం నమఃశివాయ హరహర మహా దేవ శంభో శంకర అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో ఆది దేవుడిని పుజించారు. ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన కొత్తపేట మండల పరిధిలోని పలివెల శ్రీ ఉమాకొప్పెశ్వరస్వామి దేవాలయం నందు తెల్లవారుజామునుండే విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించుకున్నారు.