జనాభా పెరుగుదల దేశ ఆర్థిక పరిస్థితి పై ప్రభావం చూపుతుందని కాబట్టి జనాభా నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. శ్రీనివాసరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం డిగ్రీ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని లెక్చరర్ ఎస్. చినబాబు, ఎన్ఎస్ఎస్ అధికారి ఎస్. అరుణ్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.