అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మండిపడ్డారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అవినీతి పితామహులు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కొత్తపేటలో చిర్ల జగ్గిరెడ్డి అని విమర్శించారు.