దసరా ఉత్సవాల్లో భాగంగా కాట్రేనికోన మండలం కందికుప్పలో కొలువైన కనకదుర్గమ్మకు స్థానిక ఆడపడుచులు, కోడళ్లు శుక్రవారం 108 రకాల మిఠాయిలతో సారె, చీర సమర్పించారు. దసరాను పురస్కరించుకుని ఏటా అమ్మవారికి సారె సమర్పిస్తారు. ముందుగా పల్లంకుర్రులోని వెంకటేశ్వరస్వామివారి ఆలయానికి వెళ్లి పూజలుచేసి ఆయన ఆడపడుచు అయిన అమ్మవారికి స్వామివారే సమర్పించినట్లుగా ఊరేగింపుగా తీసుకువచ్చారు.