కాట్రేనికోన: ప్రమాదకరంగా రహదారి

84చూసినవారు
కాట్రేనికోన మండలం కుండలేశ్వరం వద్ద ఏటిగట్టు రహదారి ప్రమాదకరంగా మారింది. ఇటీవల వచ్చిన వరదల కారణంగా ఏటుగట్టి రహదారి కొంతమేర దిగబడింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో మరమత్తు పనులు చేపట్టినప్పటికీ రహదారి కృంగిపోయింది. కార్తీక మాసం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తూ వుంటారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు బుధవారం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్