పెరవలి:  విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపునకు డ్రాయింగ్ పోటీలు

65చూసినవారు
పెరవలి:  విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపునకు డ్రాయింగ్ పోటీలు
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు డ్రాయింగ్ పోటీలు ఉపకరిస్తాయని హెచ్ఎం జి. సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ముందుకు సాగాలంటే వినూత్నంగా ఆలోచించాలన్నారు. సోమవారం పెరవలి మండలం ముక్కామల శాఖ గ్రంథాలయంలో వ్యాసరచన, డ్రాయింగ్, ఆటల పోటీలు నిర్వహించారు. గ్రంథాలయాధికారి ఎం. వెంకటేశ్వర్లు, కే. గంగాధరం, జీవీవీకే మూర్తి భాస్కరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్